ఈసీఐఎల్ సంస్థ సేవలు అభినందనీయం:  భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఈసీఐఎల్ సంస్థ సేవలు అభినందనీయం:  భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

 -కొత్తగూడెంలో దివ్యాంగులకు వీల్ చైర్ ల పంపిణీ

ముద్ర,  కుషాయిగూడ: బడుగు బలహీన వర్గాలకు, దివ్యాంగులకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్) సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లు పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి ఎస్ ఆర్) స్కీమ్ లో భాగంగా ఈసీఐఎల్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో... దివ్యాంగులకు వీల్ చైర్,  తదితర పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఈసీఐఎల్ సంస్థ సామాజిక బాధ్యతగా... నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదలకు అప్పన్న హస్తం అందజేస్తున్న ఈసీఐఎల్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని వారు కోరారు.

అలాగే భద్రాది కొత్తగూడ జిల్లా పరిధిలో సేవ కార్యక్రమాలను చేపట్టిన ఈసీఐఎల్ సంస్థ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ ఏజీఎం సి . మునికృష్ణ మాట్లాడుతూ... గత ఏడాది అక్టోబర్ 12 నుంచి 14 వరకు జిల్లా పరిధిలోని మునుగురు, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 407 మంది దివ్యాంగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలా గుర్తించిన లబ్ధిదారులకు వారి వారి అవసరాలకు అనుగుణంగా ALIMCO సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్, ఆర్టిఫిషియల్ లింబ్స్, వీల్ చైర్ , వాకింగ్ స్టిక్, తదితర వాటిని తయారు చేయించి దివ్యాంగులకు అందజేసినట్లు తెలిపారు. ఈసీఐఎల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ సంస్థ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే విశ్వనాథరెడ్డి, పర్సనల్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఈ సి ఓ ఏ కార్యనిర్వాహక కార్యదర్శి కే శ్రీనివాసరావు, ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.