Srisailam bus accident శ్రీశైలం ఘటనపై ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి

Srisailam bus accident శ్రీశైలం ఘటనపై ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి
  • మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరిన నామ
  • క్షతగాత్రులతో మాట్లాడి, ఓదార్చిన నామ నాగేశ్వరరావు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన  భక్తులు తీవ్రంగా గాయపడడం పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. చండ్రుగొండకు చెందిన  భక్తులు శనివారం శ్రీశైలం మల్లన్న దర్శనానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా  శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల మూలమలుపు వద్ద  బస్సు అదుపు తప్పి బోల్తా పడిన విషయం తెలియగానే నామ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే  అక్కడి జిల్లా అధికారులకు ఫోన్ చేసి, సంఘటన గురించిన సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీయడమే కాకుండా   వైద్య సేవలు పై వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన తక్షణ వైద్యం అందించాలని నంద్యాల జిల్లా వైద్యాధికారులను కోరారు. మెరుగైన వైద్యం, చికిత్స, బాధితులకు సాయం గురించి వైద్యాధికారులతోను, అధికార యంత్రాంగంతోనూ   మాట్లాడారు. క్షతగాత్రులను దగ్గరుండి ఆదుకోవాలని అధికారులను   కోరారు. దేవస్థానం ఆస్పత్రి, సున్నిపెంట ఆస్పత్రిలో క్షతగాత్రులకు  చికిత్స అందిస్తున్న డాక్టర్లు బృందం,పోలీస్ అధికారులు , స్థానిక ఎమ్మార్వో , క్షత గాత్రులు తోమాట్లాడారు.