పిల్లలలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకే అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

పిల్లలలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకే అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పిల్లలలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకే అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య అన్నారు.  జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో  మత్తు పదార్థాల నిర్మూలన మరియు పిల్లల రక్షణ అనే అంశంపై జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అధ్వర్యంలో  జిల్లా పోలీసులకు, సిడిపిఓ సూపర్వైజర్స్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సఖి సెంటర్ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.  రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య  మాట్లాడుతూ  ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుదలతో పాటు పిల్లలు ఎక్కువ శాతం మత్తుపదార్థా లకు బానిసగా మారుతున్నారని వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని అంతేకాకుండా వారి యొక్క హక్కులను మనమే కాలరాస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లల యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని ఎవరైనా పిల్లలకు బలవంతంగా అలవాటు చేసిన లేదా ఎవరైనా దుకాణదారులు అమ్మినా కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి పిల్లలని ఎలా గుర్తించాలి వారిని ఏ విధంగా మార్చాలి మత్తు పదార్థాలను ఎలా అరికట్టాలి అనే దానిమీద శిక్షణ ఇవ్వడం జరిగింది. మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  జిల్లాలోని పోలీసు యంత్రాంగం మొత్తం కూడా మత్తు పదార్థాలైన గంజాయి మరియు ఇతర వాటిపై రూపుమాపడానికి ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నామని ఒకవేళ ఎవరైనా పిల్లలను టార్గెట్ చేసి వారికి మత్తు పదార్థాలను ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యువత విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్కు మత్తు పానీయాలకు అలవాటు పడకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి  లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఎస్ బి  డిఎస్పి రవీంధ్ర కుమార్, ఇన్స్పెక్టర్ లు  రాజశేకర్ రాజు , శ్రీనివాస్ , సి .ఐ లు, ఎస్.ఐ లు , సిడిపిఓ సూపర్వైజర్లు, సఖి సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.