నూతన పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి

నూతన పీఆర్సీ  కమిటీ ఏర్పాటు చేయాలి

-ఎస్టీయూ రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులు భూమయ్య

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : నూతన పిఆర్సి అమలుకై కమిటీ ఏర్పాటు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజోజి భూమయ్య ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్ అధ్యక్షతన ఎస్ టీయూ జిల్లా ప్రధమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజోజి భూమయ్య మాట్లాడుతూపాత పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ తో ముగియనుందని , జూలై 1 నుంచి కొత్త పిఆర్సి అమలుకు ఇప్పటివరకు కమిటీ నియమించకపోవడం సరికాదన్నారు.ఉపాధ్యాయులకు రావాల్సిన 33 నెలల ఏరియర్సు  ఇవ్వకపోవడం, జీతం కోసం ప్రతీ నెలా 15 తారీఖు వరకు ఎదురు చూడడం  దారుణమన్నారు.

వెంటనే సీపీయస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించలన్నారు.వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయులని.గ్రేడ్ 2 పండితులు, పీఈటీలకు  పదోన్నతుల న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.ఎస్జీటీలకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా  ప్రధాన కార్యదర్శి  మచ్చ శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, వివిధ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలేపు శివరామకృష్ణ, గుండెల నరేష్  , బండి శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.