ప్రతి మండలంలో రెండు మినీ లైబ్రరిల ఏర్పాటు 

ప్రతి మండలంలో రెండు మినీ లైబ్రరిల ఏర్పాటు 

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. చంద్రశేకర్ గౌడ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని ప్రతి మండలంలో రెండు మినీ లైబ్రరీలు లేద రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్రశేకర్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా జిల్లా గ్రంథాలయంలో బుధవారం అధ్యక్షుడు డా. చంద్రశేకర్ గౌడ్ అధ్యక్షతన  సర్వసభ్య సమావేశం జరిగింది. సమవేశంలో పలు  తీర్మానాలపై సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా గ్రంథాలయం రోజు 24 గంటలు తెరిచే ఉండేలా నిర్ణయం తీసుకోగా , మధ్యాహ్న భోజన వసతి కొరకు జిల్లా  కలెక్టర్ తో  చర్చింఛి నిర్ణయం తీసుకోనున్నట్లు చైర్మన్ తెలిపారు. మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటులో భాగంగా ఒక్కో దానికి  రూ . 2 లక్షలు వెచ్చించి  ప్రతి మండలంలో రెండు మినీ లైబ్రరీలు, లేద రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు  మారంపల్లి బాబు, పుప్పాల ఉమాదేవి, లైబ్రరీ సెక్రటరీ సరిత, డిపిఓ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.