తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలి.

తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలి.

 చైర్ పర్సన్ సుజాత సత్యనారాయణ 

మెట్‌పల్లి ముద్ర:- పట్టణ ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ ప్రజలను కోరారు. బుధవారం పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తో కలసి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని. రోడ్లపై, వీధుల్లో చెత్తను వేయరాదని అన్నారు. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ముజీబ్, నిజాం, మెప్మా సీఈఓ గంగరాణి, ఆర్ పి. గీత, నాజిమా, ఆకుల ప్రవీణ్, వార్డు ప్రజలు ఉన్నారు