ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి
  • వినోద్ కుమార్ ను కలిసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల చోరువ చూపాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం  ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను జిల్లా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలంటూ  కరీంనగర్ లో ఆదివారం  ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మూడు సంవత్సరాల కాలపరిమితి పైబడిన వారందరిని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తీసుకెల్లి వాటిని సత్వరమే పరిష్కరించేలా చూడాలని వినోద్ కుమార్ ను కోరారు. గత 20 సంవత్సరాలుగా చాలా మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నారని సరైన ఉద్యోగ భద్రత లేక పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని కోరారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి 5 లక్షల ఆర్థిక సాయం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్లించాలని కోరారు. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉగ్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి పిఆర్ సీ బిస్వాల్ కమిటీ సిఫారసు ప్రకారం ప్రతి ఉద్యోగికి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అవకాశం కల్పించాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఆర్ సీ 2018 నుండి పెండింగ్ లో ఉన్న బకాయలు, జూన్ 2023 నాటికి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల జీతాలను తక్షణమే చెల్లించేలా చూడాలని వినోద్ కుమార్ ను ఔట్  సోర్సింగ్ ఎంప్లాయిస్ జయింట్ ఆక్షన్ కమీటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి సంధ్య, సమంత, కమల్, రవీంధర్ గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.