రాహుల్ పై అనర్హత వేటు అప్రజాస్వామికం: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్

రాహుల్ పై అనర్హత వేటు అప్రజాస్వామికం: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
 ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపట్టిన అదానీ కంపెనీ కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ  నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు.
కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని ప్రశ్నించారు. రాహుల్‌కు తాము అంతా అండగా ఉంటామని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని దాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నాడు అన్నారు. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.