రాష్ట్రాన్ని ఏం ఉద్దరించిర్రని దశాబ్ది ఉత్సవాలు

రాష్ట్రాన్ని ఏం ఉద్దరించిర్రని దశాబ్ది ఉత్సవాలు

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ మహిళా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ మీరు చేసేవి దశాబ్ది ఉత్సవాలు కాదు ప్రజలను మరోసారి దగా చేసేందుకు ఉత్సవా లంటు పైర్, ప్రజాధనాన్ని మరోసారి మరోసారి దండుకోవడానికి దశాబ్ది ఉత్సవాలను  సీఎం కేసీఆర్ ముంగటేసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా,రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంచకుండా ఉత్సవాలు చేసుకోడానికి ఈ ప్రజా ప్రతినిధులకు చిత్త శుద్ధి ఉండాలి.  జమ్మికుంట పట్టణంలో  అంసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ, నాయకురాలు కాంట్రాక్టర్ జేబులు నింపడానికే డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారని ఆగ్రహం ప్రగతి భవన్ సరైన టైంలో పూర్తి చేసిన శ్రద్ద నిరుపేదల డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలపై లేదా అంటూ ప్రశ్నించిన పూదరి రేణుక. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతమనే భయంతోనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతుంటే దశాబ్ది ఉత్సవాలు ఏంటి చేసిన అప్పులు చాలక.ఉత్సవాల పేరుతో మరింత అప్పు చెస్తుర్రు, వడ్లు అమ్ముడుపోయిన డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉత్సవాలు జరుపుకుంటర రైతులకు పైసలు ఇవ్వరు కానీ ఉత్సవాలకు పైసల్ ఎక్కడివి బీఆర్ఎస్ లీడర్లు ప్రజా సమస్యలు, పాలనను గాలికి వదిలేసిండ్రు.మరి కొద్ది రోజులలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము  ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సోదరీమణులు, నాగరాణి  శర్మ, కవిత, శ్రీవిద్య, తదితరులు పాల్గొన్నారు.