మహిళలు నిలదుక్కునేలా మోడీ పటిష్ట చర్యలు

మహిళలు నిలదుక్కునేలా మోడీ పటిష్ట చర్యలు
BJP Mahila Morcha national executive member Shantala Butt

బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతాల బట్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో నిలదుక్కునేలా పటిష్ట చర్యలు తీసుకుందని , మహిళల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తుందని బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతాల బట్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళల వివరాలు , మహిళల కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులను, కృషిని వివరించడానికి  కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తో అందులో భాగంగానే తాను కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగిందని తెలిపారు.

ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిడబడాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. మహిళల కోసం కేంద్రంతీసుకువచ్చిన అనేక పథకాలు రాష్ట్రం సక్రమంగా అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు.  మహిళల భవిష్యత్తుకు భరోసా కల్పించే మోడీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మహిళల కోసం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం ఇన్నేళ్లలో చేసిందిఏమీ లేదని, మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే బి ఆర్ఎస్ భావిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని , ముఖ్యంగా విచ్చలవిడి మద్యం , అత్యాచారాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకున్న పటిష్ట విధానాలు, పథకాలు మహిళా సమాజానికి వివరించడానికి మహిళా మోర్చా తగిన కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరాల జ్యోతి,జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్  మామిడాల చైతన్య,జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ ప్రేమ లత, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తమ్మడి మాలతి తదితరులు పాల్గొన్నారు.