ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పాలిట శాపం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల పాలిట శాపం
  •  వయస్సు ఎక్కువని నాట్ క్వాలిఫై చెప్పడం అన్యాయం
  • AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్ రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పై కానిస్టేబుల్, డ్రైవర్ అభ్యర్థులు ఆన్లైన్  2 మే నుండి 22, 2022 వరకు  2000/- లు చెల్లించి నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించి ఈవెంట్స్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమ నిబంధనలకు అనుగుణంగా రన్నింగ్, షాట్ పుట్, హై జంప్ లాంటివి వాటిలల్లో కూడా అర్హత సాధించారు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి అర్హత సాధించినారు. ఎస్సై కానిస్టేబుల్ అయ్యమని సంబరపడ్డారు. కాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్ 14 నుండి 23 వరకు జరిగినది అన్నారు. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్ల అభ్యర్థులు నుండి సంతకాలు తీసుకొని నాట్ క్వాలిఫైడ్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎందుకు అని అభ్యర్థులు అడిగితే మీకు ఏజీ ఎక్కువ ఉన్నదని సమాధానం చెప్పడం సరికాదన్నారు. ఆన్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాటికి అభ్యర్థులకు ఇంత వయసు ఉండాలని నియమ నిబంధనలు పెట్టకపోవడం రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్లక్ష్యం అని ఆరోపించారు. 
నాట్ క్వాలిఫైడ్ అని చెప్పడం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పట్ల అనేక అనుమానాలు వస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు కోచింగ్ లు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింట్లో క్వాలిఫై ఉద్యోగం వస్తుందనే సమయంలో ప్రభుత్వం ఎక్కువ ఉన్నదని తప్పుడు నిర్ణయాలు చేయడం వేల మంది నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగు అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్లు వారికీ ఏమి చేయాలో తోచడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , కేటీఆర్, డిజిపి  మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఎస్పై కానిస్టేబుల్ డ్రైవర్ అభ్యర్థులను క్వాలిఫైడ్ చేయాలని కోరారు. సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యారావు, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, బెక్కంటి రమేశ్, చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, జిల్లా నాయకులు బద్రి నేత పాల్గొన్నారు.