ఐలాండ్ ల అభివృద్ధిపై బల్దియా ప్రత్యేక నజర్

ఐలాండ్ ల అభివృద్ధిపై బల్దియా ప్రత్యేక నజర్
  • 4 కోట్లతో  13 జంక్షన్ల అభివృద్ధి
  • నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి
  • మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ పట్టణాన్ని  ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా  అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ వెల్లడించారు.సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ  కార్యాలయంలో జంక్షన్ల  అభివృద్ధిపై , నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, కార్పొరేటర్లు ,మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణలు చేపడుతున్నట్టు వెల్లడించారు.తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగరాన్ని 2వ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని, కరీంనగరాన్ని పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయమని అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన జంక్షన్  ట్రయల్ రన్ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు.కూడళ్ళలో నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దానిలో  భాగంగా   కోతి రాంపూర్ జంక్షన్ , పద్మ నగర్ జంక్షన్, సిక్ వాడి  జంక్షన్ ల ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే అంబేద్కర్ చౌక్ , గాంధీ చౌక్ , బాబు జగ్జీవన్ రాం చౌక్ లతో పాటు ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్, హెచ్ కె ఆర్ జంక్షన్ , కేబుల్ బ్రిడ్జ్ పై సదాశివ పల్లి జంక్షన్, తెలంగాణ చౌరస్తా కూడళ్లను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు లోకి తెచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న స్థలంలోనే కూడళ్ళను ఆధునిక డిజైన్లతో గ్రీనరీ వాటర్ లైటింగ్ సిస్టంతో గొప్పగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు.పద్మ నగర్ జంక్షన్, కోతిరంపూర్ జంక్షన్, సిక్కువాడి జంక్షన్ లతో పాటు , శాతవాహన యూనివర్సిటీ జంక్షన్, ఓల్డ్ శిశు మందిర్ జంక్షన్, కెసిఆర్ సర్క్యూట్  హౌస్, కెసిఆర్ రెస్ట్ హౌస్ లో ఫౌంటెన్, పీవీ నరసింహారావు స్టాచ్, మారుతి నగర్ చౌరస్తా, నాకా చౌరస్తా, రేకుర్తి అంబేద్కర్ జంక్షన్, సర్వోదయ స్కూల్ ఆపోజిట్ జంక్షన్, నెహ్రూ చౌక్ ల పనులను మరి కొద్ది రోజుల్లో  నిర్మాణ పనులను ప్రారంభించి ఆధునికరిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఇంత గొప్ప ఐలాండ్ లు ఎక్కడ లేవని అన్నారు.  ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కరీంనగర్ వాసుల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు.