స్తంభంపల్లిలో ఘనంగా  గంగ మాత బోనాలు

స్తంభంపల్లిలో ఘనంగా  గంగ మాత బోనాలు

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామంలో నూతనంగా  ఏర్పాటు చేసిన గంగా మాత విగ్రహానికి శుక్రవారం ఘనంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలంలోని బీరుసాని గ్రామానికి చెందిన 150 మంది మత్స్యకారులు అ గ్రామంతో  పాటుగా వరంకటాపూర్ లో ఊరేగింపు చేసి  మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం  మండలంలోని స్థంభంపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు 150 మంది మహిళలు డీజే లు, దప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి స్థంభంపల్లి గ్రామ శివారులో గల ఊర చెరువు వద్దకు వెళ్లి అక్కడ నిర్మించిన గంగామాత విగ్రహానికి బోనాలను సమర్పించారు. అనంతరం కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

వారు తెచ్చుకున్న వేట పిల్లలు, కోళ్లను మొక్కులుగా చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఆనందంగా గడిపారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లూరి రూపారాని, ఎంపీటీసీ పోడేటి సతీష్, మాజీ సర్పంచ్ పోడేటి లక్ష్మి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగుల రాజయ్య, ప్రధాన కార్యదర్శి గుమ్ముల శంకరయ్య, ఉపాధ్యక్షుడు గుమ్ముల గంగయ్య, డైరెక్టర్లు నాగుల రమేష్, నాగుల రమేష్, బోరె ఉషయ్య, గంగాధరి గణేష్, నాగుల రాజబోయ్, గుమ్మల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు