టెన్షన్... టెన్షన్... కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు

టెన్షన్... టెన్షన్...  కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు

నిఘా సంస్థల ఆధీనంలో కరీంనగర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ లో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారుల సోదాల కలకలం సృష్టించాయి. నిషేధిత సంస్థ పిఎఫ్ఐతో తబ్రేజ్ అనే వ్యక్తికి సంబంధాలున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ కరీంనగర్ లో సోదాలు నిర్వహించింది. సివిల్ ఇంజనీర్ పూర్తి చేసుకున్న తబ్రేజ్ పిఎఫ్ఐలో యాక్టివ్ మెంబర్ గా ఎన్ఐఏ గుర్తించినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో తబ్రేజ్ నివాసంపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ లోని హుస్సేన్ పురాకు చెందిన తబ్రేజ్ గత ఆరు మాసాల క్రితమే విదేశాలకు వెళ్లారు.

ఆరు మాసాల వ్యవధిలో మూడుసార్లు తనిఖీలు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఉదయం నాలుగు గంటలకు ప్రారంభించి సుమారు 6 గంటల పాటు ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దీంతో సోదాలు నిర్వహించిన ఏరియాలో భారీగా పోలీసులను మోహరించారు.  నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున  యువకులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వేదికగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారన్న సమాచారంతో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నిఘా పెట్టాయి.

సున్నితమైన అంశాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడమే ప్రధానమైన ఏజెండా పిఎఫ్ఐ  కార్యక్రమాలు చేపడుతుందని ఎన్ఐఏ భావిస్తుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నిఘా పెట్టాయి.