ఇద్దరు బాలికలను రక్షించిన లేక్ పోలీసులు

ఇద్దరు బాలికలను రక్షించిన లేక్ పోలీసులు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : దిగువ మానేరు జలాశయం (ఎల్ ఎం డి) లో శుక్రవారం  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు బాలికలను లేక్ పోలీసులు రక్షించారు. సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన ఇద్దరు బాలికలు కనిగంటి మౌనిక (22) ఒక మైనర్ బాలిక (17)లు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. సదరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడేందుకు డ్యాం నీటిలోకి దిగుతుండగా గస్తిలో ఉన్న లేక్ పోలీసులు గుర్తించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి నిలువరించారు. కుటుంబ ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు విచారణలో సదరు బాలికలు చెప్పారు. లేక్ అవుట్ పోస్ట్ ఆర్ ఎస్ ఐ ఏ సురేష్ సదర్ బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి మహిళ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇద్దరు బాలికలను రక్షించడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు కె వీరస్వామి ఎండి  సప్దార్  అలీ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు.