రాహుల్​ ‘తుగ్లక్​’ నివాసం ఖాళీ

రాహుల్​ ‘తుగ్లక్​’ నివాసం ఖాళీ

న్యూఢిల్లీ: రాహుల్​గాంధీ తుగ్లక్​రోడ్డులో ఉన్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. రాహుల్​ ఇంట్లోని సామాగ్రిని సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్​కు ట్రక్కుల్లో తరలించడం శుక్రవారం కనిపించింది. రాహుల్​గాంధీపై సూరత్​కోర్టు శిక్ష అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 22 ఏప్రిల్​ వరకూ ఇంటిని ఖాళీ చేయాలని లోక్​సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది.  దీనిపై రాహుల్​ లోక్​సభ సచివాలయానికి లేఖ రాశారు. ఆ లేఖలో తాను నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యానని ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయన్నారు. నోటీసుల్లో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానన్నారు. 2004లో అమేథీ నుంచి ఎన్నికల్లో మొదటిసారిగా గెలిచినప్పుడు 2005లో ఆయనకు ప్రభుత్వం ఈ భవనాన్ని కేటాయించింది.