మోదీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం

మోదీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు: ప్రజలను అణచివేసే సనాతన ధర్మాన్ని తన కుమారుడు నిర్మూలించాలని చెప్పాడని, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ,ప్రచారం చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని ప్రధాని మోదీ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారో ఏమో అని సీఎం స్టాలిన్​ విమర్శించారు. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఉదయనిధిపై తప్పుడు వీడియోలను ప్రచారం చేసే పని కల్పించి తమ పేరును భ్రష్టుపట్టించాలని చూస్తున్నాయన్నారు. అదీగాక ఉదయనిధి తలపై స్వామిజీ రూ. 10 కోట్ల వెలకట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఉదయనిధిపై మాత్రం కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని కూడా అసలు జరిగింది తెలుసుకోకుండా ధీటుగా వ్యాఖ్యలు చేయాలని మంత్రి వర్గాన్ని ఆదేశించడం, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం తీవ్ర నిరుత్సాహానికి, ఆగ్రహానికి గురి చేసిందన్నారు. వ్యాఖ్యల పూర్తి పరమార్థం తెలుసుకోకుండా వ్యవహరించడం సరికాదని సీఎం స్టాలిన్​ అన్నారు. 

వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా ఉదయనిధి..

మ‌ణిపూర్ హింస‌, అవినీతిని క‌ప్పిపుచ్చుకునేందుకే స‌నాత‌న ర‌గ‌డను బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటానని అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి పేర్కొన్నారు. బీజేపీ నేత‌ల మ‌నుగడ ఇదేనని, వారికి ఎలా ప్రజల్లో ఉండాలో తెలియ‌ద‌ని మండిప‌డ్డారు. మణిపూర్​ ఘర్షణలో 250 మంది ప్రాణాలు కోల్పోవడం, 7.5 లక్షల కోట్ల బీజేపీ అవినీతి తదితరాలపై నుంచి దృష్టి మళ్లీంచేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం చేసిందేమీ లేదని ఉదయనిధి ఆరోపించారు.