ఎమ్మెల్యేలపై ‘మమత’

ఎమ్మెల్యేలపై ‘మమత’
  • రూ. 40వేల వేతనం పెంపు

కోల్​కత్తా: పశ్చిమ బెంగాల్​తృణమూల్​కాంగ్రెస్​ ఎమ్మెల్యేల వేతనాలపై ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ‘మమత’ చూపించారు. ఎమ్మెల్యేల వేతనాలను రూ. 40 వేలను పెంచనున్నట్లు అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. ఇక నుంచి జూన్​20వ తేదీన బెంగాల్​లో కొత్త సంవత్సరాన్ని నిర్వహించుకోనున్నట్లు అసెంబ్లీలో తీర్మాణం చేశారు. రాష్ర్ట గవర్నర్​తమ నిర్ణయాన్ని ఆమోదించినా, ఆమోదించకున్నా కొత్త సంవత్సరం నిర్వహించుకోనున్నట్లు ముందే చెప్పి సెగ పుట్టించారు. కాగా తన వేతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. గత కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ వేతనం కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే బెంగాల్​లో ప్రజాప్రతినిధుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని మమత అన్నారు. కాగా పెరిగిన జీతంతో ఎమ్మెల్యేల వేతనం మొత్తం ఎంత అనే విషయంపై మాత్రమ సీఎం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బీజేపీపై మమతా బెనర్జీ విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. బీజేపీది ప్రజారంజక పాలన  కాదన్నారు. అడుగడుగునా కేంద్ర సంస్థలతో ప్రతిపక్ష నేతలకు బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బెదిరింపులకు టీఎంసీ నాయకులు భయపడబోరన్నారు. ఇండియా కూటమిని కూడా అస్థిరపరిచే కుట్రలకు బీజేపీ తెరతీసిందని మమతా బెనర్జీ ఆరోపించారు.