మహిళలతో  అమృతపాల్​ సింగ్​కు  వివాహేతర సంబంధాలు

మహిళలతో  అమృతపాల్​ సింగ్​కు  వివాహేతర సంబంధాలు

ప్రత్యేక ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ లీలలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. అమృతపాల్ సింగ్ పలువురు అవివాహిత, వివాహిత మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని వెల్లడైంది.  ఖలిస్థాన్ నాయకుడైన సింగ్ పలువురు మహిళలతో సోషల్ మీడియాలో ఛాటింగ్ చేశాడని, మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడని తేలింది. పలువురు మహిళలతో అమృతపాల్ సింగ్ కు సన్నిహిత అక్రమ సంబంధాలున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమృత్ పాల్ మహిళలతో ముద్దు ముచ్చట్లు జరిపాడని తేలింది.

వేర్పాటు వాద నాయకుడైన సింగ్ మహిళా అనుచర గణానికి క్రమం తప్పకుండా సందేశాలు పంపించాడని వెల్లడైంది.ఎన్నారై అయిన కిరణ్ దీప్ ను పెళ్లాడిన సింగ్ ఆమెతో హనీమూన్​  దుబాయ్ లో ఉందని పేర్కొన్నాడు.అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట ప్రారంభించారు. 150 కార్ల కాన్వాయ్ తో పోలీసులు వెంటాడినా  సింగ్ తప్పించుకున్నాడని సమాచారం. అమృతపాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్టు చేసి వారిని ప్రశ్నిస్తున్నారు.అమృతపాల్, అతని సహాయకులు యూకే, యూఎస్ లలో ఖలిస్థానీ అనుకూల నిరసన ప్రదర్శనలు జరిపాడు.