బోదకాలు వ్యాధి నివారణే లక్ష్యం
రామకృష్ణాపూర్,ముద్ర: బోదకాలను పూర్తి స్థాయిలో నివారించటమే లక్ష్యంమని మందమర్రి యూ.పీ.హెచ్.సి. వైద్యురాలు మానస, ప్రత్యూష అన్నారు. గురువారం క్యాతన పల్లి మున్సిపల్ కార్యాలయంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా బోదకాలు నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళకు మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమాదేవి, కో ఆప్షన్ సభ్యురాలు రజియా, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ,మేనేజర్ నాగరాజు, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.