ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి అందింది..

ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి అందింది..
  • గృహలక్ష్మి నిరుపేద కుటుంబాలకు అందేనా...?
  • కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు బాబు నాయక్

ముద్ర: అనంతగిరి:-రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టిందని, ఈ పథకం ద్వారా పేద కుటుంబం లకు ఇల్లు అందడం అసాధ్యమని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు నాయక్ విమర్శలు చేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో ఆయన ముద్ర  తో మాట్లాడుతు.. గృహలక్ష్మ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ‘మీ సేవ’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.మరి కొద్ది మంది మండలాఫీసులకు క్యూ కడుతున్నారు. స్కీమ్ కింద వచ్చే సాయం కోసం గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందడం వారికి కత్తిమీద సాములా మారిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనిలు ప్రతి ఒక్క నీరు పేద కుటుంబానికి అందెల కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. కొన్ని రోజులు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రామాలు, మరి కొన్ని రోజులు మూడెకరాల భూమి పేరుతో మోసం, ఇలా పేద ప్రజలను తన చేతిలో కీలుబొమ్మలాగా చేసుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలతో ఆడుకుంటున్నారని తెలిపారు.

  • ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు

‘గృహలక్ష్మి’ పథకానికి అప్లై చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో గరిష్ట వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షకు మించి ఉండొద్దని ప్రభుత్వం సీలింగ్ విధించింది. ఆ ప్రకారం మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నది.ఇప్పటికే చాలా పథకాలకు మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తలెత్తలేదు. కానీ ఈ స్కీమ్‌ కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడం లేదు. దీని బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడంతో ఒక్కో జిల్లా లో ఒక్కో తీరులో షెడ్యూల్ ఖరారైందని తెలిపారు