కెసిఆర్ పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి... 

కెసిఆర్ పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి... 
  • మూడు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా... 
  • కాలంతో పోటీపడి పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం... 
  • యువత అన్ని రంగాల్లో రాణించాలి... 
  • మూడు సంవత్సరాలలో 30 సంవత్సరాల అభివృద్ధి... 

హుజుర్ నగర్ ముద్ర : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెడుతుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2k రన్ ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఇందిరా చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ ప్రభుత్వం కాలంతో పోటీపడి పనిచేస్తుందని అన్నారు. ప్రతినిత్యం ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. తాను శాసనసభ్యులుగా ఎన్నికైన మూడు సంవత్సరాల్లోనే 30 సంవత్సరాల జరిగే అభివృద్ధిని చేసి చూపించానని అన్నారు. నగరాలతో పోటీపడి హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

3500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు .మరో మూడు మాసాలలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని తెలిపారు .అంకితభావంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2కే రన్ మాదిరిగా అభివృద్ధి పరుగులు పెడుతున్నట్టు తెలిపారు .ఈ ప్రాంత వ్యక్తిగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో రైతులకు రైతుబంధు పేదలకు దళిత బంధు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అనేక రకాల పథకాలను అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సైదిరెడ్డి ఎంపీపీ శ్రీనివాస్ చైర్మన్ అర్చన రవి జిల్లా అధికారి యాదయ్య సిఐ రామలింగారెడ్డి ఎస్సై వెంకట్ రెడ్డి ఎంపీపీ పార్వతీ కొండ నాయక్ పో రెడ్డి శ్రీలత రెడ్డి పద్మ జక్కుల నాగేశ్వరరావు ఓరుగంటి నాగేశ్వరరావు సైదులు కొండా నాయక్ అమర్నాథ్ రెడ్డి అమర్ గుండా పని కుమారి  పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.