ఎస్సారెస్పీ కాలువకు బి.ఎన్.రెడ్డి పేరు పెట్టాలి

ఎస్సారెస్పీ కాలువకు బి.ఎన్.రెడ్డి పేరు పెట్టాలి

ప్రగతి నగర్ వద్ద బియన్స్ శృతి వనం నిర్మాణం చేయాలి

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు మాజీ పార్లమెంటేరిఎన్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారని అందుకు నిదర్శనంగా ఎస్సారెస్పీ కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును పెట్టాలని పలువురు సిపిఎం నాయకులు కోరారు. నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల సమీపంలోని ప్రగతి నగర్ వద్ద బి.యన్.రెడ్డి స్మృతి వనం నిర్మాణం కోసం సూచిక బోర్డులను పెట్టినానంతరం బి ఎన్ చిత్రపటానికి పూల మాలలు  వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా బి ఎన్ కుమార్తె రజిని మాట్లాడుతూ ఈ ప్రాంతం కోసం తన తండ్రి ఎన్నో త్యాగాలు చేశాడని అలాంటి వ్యక్తికి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ కాలువకు బి ఎన్ పేరు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, కొత్తగట్టు మల్లయ్య, ఆకారం సైదులు ,ఉప్పలయ్య ,అశోక్ రెడ్డి ,సుందర్రావు, లతోపాటు పలువురు పాల్గొన్నారు.