రానున్న ఎన్నికల్లో బి ఆర్ యస్ దే విజయం

రానున్న ఎన్నికల్లో బి ఆర్ యస్ దే విజయం
  • ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు మావే
  • రైతును రాజును చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే 
  • 16 ఏండ్లు పంటలను ఎండబెట్టిన ఘనత కాంగ్రస్ వారిదే 
  • కాంగ్రెస్, బి జె పి లపై నిప్పులు చెరిగిన మంత్రులు హరీష్ , జగదీష్ రెడ్డి 
  • తెలంగాణ తల్లి, శ్రీకాంతాచారి విగ్రహాలను, అంకిరెడ్డి రైతువేదికను ఆవిష్కరించిన మంత్రులు
  • మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ నుండి చేరికలు 

మఠంపల్లి ,ముద్ర: రానున్న ఎన్నికల్లో బి ఆర్ యస్ ప్రజల ఆశీర్వాదంతో మూడవ సారి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ఆర్ధికమంత్రి ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.మఠంపల్లి లో తెలంగాణా తల్లి,తెలంగాణా మలిదశ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాలను మంత్రులు హరీష్ రావు,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యే లు సైదిరెడ్డి చిరుమర్తి లింగయ్య ,బొల్లం మల్లయ్య యాదవ్,భాస్కర్ రావు లతో ఆవిష్కరించారు. అదేవిధంగా అంకిరెడ్డి రైతువేధికను సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్లోరోసిస్ ,కరువు పెరిగిందన్నారు. బి ఆర్ యస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటలు సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. హుజుర్ గగర్ ఎమ్మెల్యే గ శానం పూడి సైదిరెడ్డి విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో 4 వేల కోట్ల రూపాయల తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి .జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రికార్డు స్థాయిలో ఉన్నదని భారతదేశానికి ఆహార ధాన్యాలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ముందువరుసలో ఉన్నదని తెలంగాణా ప్రజలు గర్వపడాలన్నారు.రానున్న ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు బి ఆర్ యస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గ ప్రజల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంతో పాటు ప్రజల కోసం రాత్రి,పగలు తేడా లేకుండా శ్రమిస్తున్న హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండలంలోని రఘునాధపాలెం గ్రామానికి చెందిన మాజీ వైస్ యం పి పి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సల్వాది సీతారామయ్య తన అనుచరులతో బి ఆర్ యస్ పార్టీలో చేరారు.ఈకార్యక్రమంలో యం పి పి మూడవత్ పార్వతి కొండా నాయక్,జడ్పిటిసి జగన్ నాయక్ ,మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి,బి ఆర్ యస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య ,వెంకట్ రెడ్డి,హఫీజ్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.