ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

మద్దిరాల ముద్ర: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 9వ విడత హరితహారం కార్యక్రమం  నిర్వహించారు. విద్యార్థుల తో భారీ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్ మాట్లాడుతూ పచ్చని చెట్లు , పల్లెప్రగతి  గ్రామానికి ఆహాల్లాదాన్ని ఇస్తాయని , మానవ మనుగడకు మొక్కే ఆధారం అన్నారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటి  సౌరక్షించాలని అన్నారు. 

అదేవిధంగా పెరిగిన చెట్లను బొగ్గు బట్టీలకు తరలకుండా అధికారులు చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ  డి సరోజ, తహసీల్దార్ ఆమీన్ సింగ్ , స్థానిక సర్పంచ్ ఇంతియాజ్ ఖాతూన్, వైస్ ఎంపిపి బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంధాలయ డైరెక్టర్ రవీందర్ రావు. వ్యవసాయ అధికారి హేమంత్ పాటిల్,ఎంపిటిసి నాగేల్లి శ్రీలత శ్రావణ్ కుమార్, వడ్డాణం మధుసూదన్, జిపి కార్యదర్శి శ్రీనివాస్, వల్లపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.