సూర్యాపేట అభివృద్ధి జగదీష్ రెడ్డి కే సాధ్యం

సూర్యాపేట అభివృద్ధి జగదీష్ రెడ్డి కే సాధ్యం

జగదీష్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని  తమిళనాడులోని వేలంగి మేరీమాత ఆలయంలో మోకాళ్లపై నడిచి ప్రత్యేక ప్రార్థనలు చేసిన     
కో ఆప్షన్ స్వరూపశశికాంత్ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవది దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు పొందాలని  తమిళనాడు లో  దక్షిణ భారతదేశంలోని ఎక్కువ మంది విశ్వాసులు దర్శించే దేవాలయం వేలంగిని మేరీమాత దేవాలయంలో సూర్యాపేట క్రిస్టియన్ మైనారిటీ మునిసిపల్ కోఆప్షన్ సభ్యురాలు పెద్దపంగ స్వరూప రాణి తన భర్త బీ ఆర్ఎస్  మైనారిటీ రాష్ట్ర నాయకులు పూర్ణా శశికాంత్ తో కలిసి మోకాళ్లపై నడిచి ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు సోమవారం విలేకరులకు తెలిపారు గౌరవ మంత్రివర్యులు  గుంటకండ్ల జగదీష్ రెడ్డి  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని పూర్ణ శశి కాంత్ మోకాళ్ళ మీద గుడి వరకు కిలోమీటర్ పైగా దూరం నడిచి,  ఆదివారం ఉదయం పూట ప్రధాన ఆలయంలో మంత్రి గెలుపు కొరకు ఫాథర్ జోసెఫ్ చే ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు  చేయడం జరిగిందన్నారు అనంతరం మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు స్వరూప రాణి మాట్లాడుతూ  సూర్యాపేట ను చరిత్రలో ఇంత అబివృద్ది ఇంతవరకు ఎవ్వరు చేయలేదని, క్రైస్తవ  కమ్యూనిటికి వారు చేసిన సేవ మరువ లేమని , అందుకే దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది విశ్వసించే దేవాలయం వేలంగిని మరియ మాత దేవాలయం,అని ఇక్కడ ఏ కోరిక కోరుకున్న తప్పకుండా నెరవేరుతుందని తెలిసి ఇక్కడికి వచ్చామని , నాగపట్నం చర్చ్, చెన్నైలో ఉన్న లిటిల్ మౌంట్ ,సెయింట్ థామస్ బసలిక చర్చ్ ను దర్శించి మంత్రి  కోసం ప్రార్థనలు జరిపించామని ఆమె తెలిపారు.