వర్షాల లేమితో ఆలస్యం అవుతున్న వరినాట్లు

వర్షాల లేమితో ఆలస్యం అవుతున్న వరినాట్లు

తుంగతుర్తి ముద్ర:-ఒకపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు మరోపక్క ఎస్సారెస్పీ కాల్వ ద్వారా వచ్చే గోదావరి జలాలు ఇంకా తుంగతుర్తి ప్రాంతానికి చేరుకోకపోవడంతో వివిధ మండలాల్లోని చెరువుల కింద ఆయకట్టు ఇంకా బీడు భూములు గానే  కనిపిస్తున్నాయి .ఈసారి ఖరీఫ్ సీజన్ లో బావులు బోర్ల కింద సైతం వరి నాట్లు మందకొడి గానే సాగుతున్నాయి .గత సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడం అలాగే ఎస్సారెస్పీ కాలువల ద్వారా సకాలంలో సాగునీరు రావడంతో చెరువులు అలుగులు పోసి ఎక్కడ చూసినా వరి నాట్లు దర్శనమిచ్చాయి.  కాగా ఈ సంవత్సరం జూలై చివరి వారంలో సైతం పొలాలు దున్నకాలు ,వరి నార్లు పోయడం కనిపిస్తోంది .ఖరీఫ్ పంట సాగు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనే మాట రైతుల నుండి వినవస్తోంది .

  • నాటుకు సిద్ధంగా ఉన్న వరి నారు, పొలం

గోదావరి జలాలు వస్తేనే చెరువులు నిండే పరిస్థితి నెలకొంది  ఇందుకు కారణం వర్షాలు కురవకపోవడమే. ప్రస్తుతం తుంగతుర్తి ,అరవపల్లి ,నాగారం ,నూతనకల్ ,తిరుమలగిరి ,మండలాల్లో చెరువులలో సగానికి పైగా నీరున్న సాగుకు సరిపోవు అనే మాట రైతులు చెబుతున్నారు .కొన్ని చెరువుల కింద గోదావరి జలాలు రాకపోతాయ అనే ఆశతో వరి నార్లు పోశారు. మొదటి పంట సాగుతో తీవ్ర ఆలస్యం జరగడంతో రెండో పంట ఇంకా వెనక్కి వెళ్తోందనేది రైతుల మాట .ఒకటి రెండు భారీ వర్షాలు కురిసిన లేక తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలు చెరువులలోకి వచ్చిన వరి నాట్లు అవుతాయని  లేకుంటే ఈసారి చెరువుల కింద వరి పంట కృష్ణార్పణ మేనని రైతులు చెప్తున్నారు .అరకొర వర్షాలకు బావులు బోర్ల కింద నాట్లు వేసిన రైతుల  పొలాలకు నీరు సరిపోవడం లేదని మాట అంటున్నారు .వరుణుడి కరుణతో వర్షాలు కురుస్తాయా ?లేక ఎస్సారెస్పీ అధికారులు గోదావరి జలాలతో చెరువుల నింపి రైతులను ? వేచి చూడాల్సిందే