గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు

గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు
  • గిరిజనుల తండాలు, గూడెంలను నూతన గ్రామ పంచాయతీలుగా మార్పు
  • గిరిజన విద్యార్థుల కోసం ఆధునిక సదుపాయాలతో రెసిడెన్షియల్ విద్యాలయాల ఏర్పాటు
  • గిరిజనుల సంస్కృతిని గౌరవిస్తూ అధికారికంగా వేడుకల నిర్వహణ
  • చివ్వేంల మండలం జయరాం గుడి తండా గ్రామంలో నిర్వహించిన గిరిజన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సందర్భంగా జయరాం గుడి తండాలో నిర్వహించిన తెలంగాణ గిరిజన దినోత్సవ కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సంతు సేవాలాల్ మహారాజ్ కు పూలమాలలు సమర్పించారు. అనంతరం  భోగ్ బండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు. గిరిజన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలను ,వివరిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన లంబాడి తండా గ్రామపంచాయతీలలో గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో  108 గిరిజన ఆవాసాలను నూతన  గ్రామపంచాయతీ లుగా ఏర్పాటు చేశామని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వేడుకల్లో భాగంగా నేడు  గ్రామపంచాయతీలో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన బతుకుల్లో అతిపెద్ద మార్పు సంబంధించిందని ఇప్పుడు ప్రభుత్వం తండాల్లో ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని అందుకు నిదర్శనంగా గిరిజన ఉత్సవాలను అందరితోపాటుగా ఘనంగా నిర్వహిస్తుం నామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతం కి పెంచడం జరిగిందని, గిరిజనులు ఊహించని మార్పు జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు దీనిపై హర్షం వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. తండాల్లో విద్యకు నోచుకోకుండా ఎంతోమంది గిరిజన పిల్లలు ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో  గిరిజన పాఠశాలలు, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిందని, దీనిలో భాగంగా గిరిజన విద్యార్థులకు సూర్యాపేట జిల్లాలో 4 గిరిజన పాఠశాలలు 1 గిరిజన డిగ్రీ కళాశాల ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆడపిల్లలు కూడా మగ పిల్లల మాదిరిగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారని పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని, వారి విద్య కొరకు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం గిరిజన  పెద్దలను ముగ్గురుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేష్ కుమార్, ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, సర్పంచ్ సుశీల పంతులు, డిటిడిఓ శంకర్, తాసిల్దార్ రంగారావు, ఎంపీడీవో లక్ష్మి ,ఎంపీ ఓ గోపి, ఏపీఓ నాగయ్య ,ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.