బీసీలఐక్యత వల్లనే కర్ణాటకలో బిజెపికి ఓటమి

బీసీలఐక్యత వల్లనే కర్ణాటకలో బిజెపికి ఓటమి

పాలకవీడు,ముద్ర: బీసీ జన గణన చేపట్టాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టడం వల్లనే కర్ణాటకలో బిజెపి భంగపాటుకు గురైందని  బిసి  హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు.

 సోమవారం  ఆయన  పాలకీడు మండల సిపిఐ కార్యాలయం రైతు భవన్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో......
 గతంలో బిజెపి పార్టీనీ కూడా బీసీ జన గణన చేపట్టాలని అనేక సందర్భాలలో ఆనాటి పాలకులను అడిగారని,, కానీ నేడు అధికారంలోకి వచ్చాక బీసీ జన గణ న పట్ల ఏకాభిప్రాయ సాధన పేరుతో తప్పించుకును దొంగ ఆటలు ఆడుతుంది అన్నారు. బీసీలు నిశ్శబ్ద విప్లవం ద్వారా కర్ణాటకలో బిజెపికి బుద్ధి చెప్పారని, త్వరలో రానున్న అన్ని రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా నిశ్శబ్ద విప్లవం ద్వారా బీసీలు బిజెపికి చరమగీతం పాడతారనడంలో  ఎలాంటి సందేహం లేదన్నారు, జనగణన లో కుల గణన  జరిపి జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం సీట్లు ఇచ్చి బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించని యెడల బిజెపి ఓటమి ఖాయం అని ఆయన జోష్యం చెప్పారు.

బిజెపి వారు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదని తలచిన విధంగానే బిజెపి చేసే కుట్రలు కుతంత్రాలను అర్థం చేసుకోలేదని తెలివిగా ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ కు గండి కొట్టి జనగణన చేయకుండా వారిని మభ్యపెట్టి అణచివేతకు గురిచేసి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు,  ఆయన వెంట బీసీ నాయకులు కొండా శ్రీనివాస్ గౌడ్ పేరూరి నాగయ్య, బుర్రి చంద్రయ్య, తదితరులు ఉన్నారు.