రౌడీయిజం చేస్తే తాటతీస్తా.

రౌడీయిజం చేస్తే తాటతీస్తా.
  • పరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదు.
  • అక్రమాలకు పాల్పడితే ఎవడైనా.. ఎంతటి వారైనా  జైలుకే.
  • పాత రోజులు కావివి...అన్యాయంపై తిరగబడే రోజులు..
  • తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉంది...శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.
  • శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని  చేసుకుంటూ వెళ్తుంది.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేటలో ఎవడయినా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..పరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదన్నారు.అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని వార్నింగ్ ఇచ్చారు .ఇవి పాత రోజులు కావనీ...అన్యాయం పై తిరగబడే రోజులనీ గుర్తుచేశారు.తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందనీ భూ కబ్జా దారులకు మంత్రి జగదీష్ రెడ్డి సుతి మెత్తని కౌంటరిచ్చారు.. ఓ కార్యక్రమం లో మంత్రి చేసిన వ్యాఖ్యలు అక్రమదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.