వేములవాడ ఎన్నికల వాతవరణం

వేములవాడ ఎన్నికల వాతవరణం
  • ప్రజా క్షేత్రంలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు
    వేములవాడలో బారి ర్యాలీ.. మంగళహరతులతో స్వాగతం పలికిన మహిళలు

ముద్ర ప్రతినిధి,రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఎన్నికల నోటీఫీకేషన్ రాకముందే రాజకీయం వేడిక్కుతుంది. బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పర్యటనలతో ఎన్నికత వాతవరణం తలపిస్తుంది. ఆదివారం వేములవాడ పట్టణంలోని 25 వార్డులో కౌన్సిలర్ గూడూరి లక్ష్మీ, మధు దంపతుల ఆధ్వర్యంలో బారి ర్యాలీ నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. చల్మెడకు మద్దతుగా వార్డులో సభను ఏర్పాటు చేశారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో బారి మేజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు మాట్లాడుతూ తాను ప్రజా సేవా కోసం వస్తున్నని, డబ్బుపై తనకు ధ్యాస లేదన్నారు. తనను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని, వేములవాడ అభివృద్ది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో చేస్తానన్నారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ను మరోసారి ఆశీర్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి జడ్పీటీసీ మీనయ్య, నాయకులు నిమ్మశెట్టి విజయ్, గూడూరి మధు తదితరులు పాల్గొన్నారు.