కాంగ్రెస్ పార్టీ  అధికారంలోని వొస్తే కారు చీకట్లు కమ్ముకుంటాయి - ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ  అధికారంలోని వొస్తే కారు చీకట్లు కమ్ముకుంటాయి - ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: తెలకపల్లి మండలంలోని లక్నారం, గోలగుండం, జంగమొనిపల్లి, బొప్పాల్లి, ఆలేరు గ్రామాల్లో 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2012లో రాజకీయాలకు వచ్చి 2014 - 2018 లో ఎమ్మెల్యే గ గెలిచి నియోజికవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను,ఇంకా చేయవలసిన పనులను తెలుసుకోవాలని "పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న పాదయాత్ర"తో నియోజికవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టిన అని అన్నారు,గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి కి బోనాలతో,పిర్లతో,బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికిన ఆయా గ్రామ ప్రజలు, అడుగులో అడుగు వేస్తూ దారిపొడుగునా నడుస్తున్న ఆయా గ్రామ ప్రజలు...

పాదయాత్ర చేస్తూ దారిలో రైతులను, కూలీలను కలిసి వారితో సమస్యలను అడిగి తెలుసకుంటున్నారు, అనంతరం ఆయా గ్రామాల్లో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వివరించారు,గత 60 ఏళ్లలో జరగని అభివృధి కేవలం 9 ఏళ్లలో జరిగింది అని అన్నారు, రైతులకు, రైతు బంధు, రుణ మాఫీ,24గంటల కరెంట్, రైతు భీమ,సరైన సమయంలో ఎరువులు, సాగు నీళ్ళు అందజేస్తున్న సీఎం కెసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అందరూ అండగా వుండాలి అని తెలిపారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారినవి అని అన్నారు, ఒకప్పుడు గ్రామాల్లో కరెంట్ వుండేది కాదు, తగానికే నీళ్ళు వుండేవి కాదు, పశువులకు గడ్డి కూడా దొరకపోయేది,కానీ ఎప్పుడూ ఎక్కడా ఏ గ్రామంలో చూసిన పచ్చని పంట పొలాలతో, నిండుగా ఉన్న చెరువులలో కళకళలాడుతున్నాయి అని అన్నారు,తను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత గ్రామాల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగింది అని అన్నారు,ఒకప్పుడు రోడ్లు లేక బజార్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపే వారు,కానీ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వెయ్యడం జరిగింది అన్నారు, పాదయాత్ర చేస్తూ పచ్చని పంటపొలాలు మధ్యలో నడుస్తున్నప్పుడు చాలా సంతోషంగా వుంది అని అన్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి అని అన్నారు, కాంగ్రెస్ పార్టీలో 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు వున్నారు అని ఎద్దేవా చేశారు,అదే BRS పార్టీలో అయితే ఒకే ఒక్కడు సీఎం కెసీఆర్ గారు అని అన్నారు, మూడు గంటల కరెంట్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు లేక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న BRS పార్టీ కి ఓటు వేస్తారా అని అడిగారు, నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే 200 పించాన్ ఇచ్చే వాళ్ళు రేపు 4000 వేలు ఇస్తారట, అధికారంలో వున్న రాష్ట్రాల్లో 4000 వేలు పింఛన్ అమలు చేసి తెలంగాణ ప్రజలకు చూపించాలి అని డిమాండ్ చేశారు,మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కారు చీకట్లు కమ్ముకుంటాయి, ఇ ప్పుడెప్పుడే వెలుగులు వచ్చిన మన జీవితాల్లో మళ్ళీ చీకట్లు వస్తాయి అని అన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పచ్చి మోసగాళ్ళు అని అన్నారు.


ఒక ఆడబిడ్డ పుడితే కెసీఆర్ కిట్టు అందజేసి 13 వెలు,ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు MJR ట్రస్ట్ అధ్వర్యంలో ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని అన్నారు,ఇప్పటివరకు 15 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అన్ని మౌలిక సదుపాయాలతో కొత్త భావనలు నిర్మించాం అని అన్నారు,ట్రస్ట్ అధ్వర్యంలో సామూహిక వివాహాలు,ఉచిత డ్రైవింగ్ లైసెన్స్,మర్రన్న క్యాంటీన్ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నము అని అన్నారు,ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.