తెలంగాణ తల్లి సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం - ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే

తెలంగాణ తల్లి సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం - ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే

ముద్ర.వీపనగండ్ల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియామ్మ రుణానికి తీర్చుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.ఆదివారం మండలంలోని కాల్వరాల గ్రామంలో గడపగడప కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే నని,అన్నాడు వ్యవసాయానికి విద్యుత్ బిల్లులతో రైతులు కష్టాలు పడుతుంటే రైతుల పక్షాన పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు.18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన 13 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యే గా తర్వాత మంత్రిగా పనిచేసే పనిచేసిన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని అన్నారు.ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ల పుటకు ఒక పార్టీ మారుతూ అధికార పార్టీకి అమ్ముడుపోయే వ్యక్తిని కాదని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు అంటూ దళితులను మోసం చేస్తున్నారని, చదువుకున్న నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భీమా జూరాల చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న ,కాలువలలో పుడుకుపోయి జమ్ము మొలిచిన పాలకులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల 2500 రూపాయలు, 500 రూపాయల వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు, గృహ జ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సహాయం, యువ వికాస కింద విద్యా భరోసా కింద ఐదు లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఏఐసీసీ బీసీ సెల్ కోఆర్డినేటర్ కేతురు వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి,సింగిల్ విండో మాజీ చైర్మన్ బాల్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఏత్తం కృష్ణయ్య,నాయకులు  గంగిరెడ్డి, చక్ర వెంకటేష్,వెంకటరాజయ్య,నరసింహ, పెద్ద వెంకటేష్, ఉసేన్,గోపి,రవిందర్ రెడ్డి,వేంకటేశ్వర రెడ్డి,సుకన్య రెడ్డి తదితరులు ఉన్నారు.