బీఆర్‌ఎస్‌ హయాంలోనే  సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే  సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి
  • 10,12 వ వార్డ్ లో ఇంటిటి ప్రచారం
  • గడగడపను తడుతూ, జనం తో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట : గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి సూర్యాపేట  లో గడపగడపనూ తడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం  ఉదయం సూర్యాపేటలోని 10,12 వ వార్డ్ లలో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ఏదో ఒక పథకం ప్రతి పేదోడి ఇంటికి చేరిందని తెలిపారు.. రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డకా పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తు న్నాయన్నారు.మిషన్‌ భగీరథ నీటితో గ్రామా ల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేయడం ఖాయం ఆన్నారు. అంతకుముందు పిల్లలమర్రి శివాలయం లో  ప్రత్యేక పూజలు చేసి, శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రార్థించారు .