రైతులు ఆదాయాన్ని ఇచ్చే పంటలను వేయాలి: జిల్లా కలెక్టర్ వెంకట్రావు

రైతులు ఆదాయాన్ని ఇచ్చే పంటలను వేయాలి: జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర, మునగాల: రైతులు ఆదాయాన్నిచ్చే పంటలను వేసే విధంగా ఉద్యాన శాఖ అధికారులు అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో మాధవరం గ్రామానికి చెందిన రైతు వేమూరి సురేష్ నూతనంగా నాటిన ఆయిల్ ఫామ్ తోటను క్షేత్ర సందర్శన చేసి మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ గా సూర్యాపేట జిల్లాని మార్చాలని ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం ఇచ్చే పామాయిల్ తోటలు పెంచాలని రైతులకు అధికారులకు సూచించారు ఎందుకు కావలసిన పూర్తి సహాయ సహకారం జిల్లా పరిపాలన యంత్రాంగం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 2450 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. ఈ సంవత్సరానికి గాను 9800 ఎకరాలు పామాయిల్ సాగు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

క్రొత్తగా వేస్తున్న తోటల్లో ప్రతి మిర్చి కూరగాయలు అంతర పంటలుగా సాగు చేస్తున్నారని వీటి వల్ల కూడా రైతుకు కొంత ఆదాయం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం కేటాయించిన లక్ష్యానికి గాను కావలసిన సుమారు 6 లక్షల మొక్కలు మన జిల్లాలో రెండు నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి గాను 500 ఎకరాల్లో ఇప్పటికీ నాటు పెట్టడం జరిగిందని అలాగే 1785 ఎకరాల్లో 401 మంది రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలియజేశారు. మాదారం గ్రామంలో పామాయిల్ తోటలు, నర్సరీలు ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. బిందు సేద్యం పైన రాయితీ, పామాయిల్ మొక్కలపైన రాయితీ ,మరియు నాలుగు సంవత్సరాల వరకు యాజమాన్యపు ఖర్చులకు ఇచ్చే రాయితీలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి శ్రీధర్ గౌడ్, ఉద్యాన శాఖ అధికారి శ్రీ కన్న జగన్, పతాంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ జిల్లా మేనేజర్ జె హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ డి సుధాకర్, వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు.