హిమాయత్ సాగర్ రెండు ద్వారాలు ఎత్తివేత

హిమాయత్ సాగర్ రెండు ద్వారాలు ఎత్తివేత
  •  పెరుగుతన్న ఉస్మాన్ సాగర్ నీటి మట్టం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను తేరిచి నీరు ని మూసి నది లో కి వదులుతున్నారు. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ జలాశయం రెండు గేట్లను (గేట్ నెం. 5.10) తెరిచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం తేరిచారు. శుక్రవారం నాడు హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 1200 క్యూసెకులు గా ఉంది. కాగా ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1784 అడుగుల వద్ద ఉంది, దాని పూర్తి సామర్థ్యం 1790 అడుగుల కంటే కేవలం ఆరు అడుగుల దిగువన ఉంది. ఇదిలా ఉండగా హిమాయత్ సాగర్సమర్థ్యం 1764 అడుగులు కాగా, నీటి మట్టం 1760 అడుగుల వద్ద నమోదైంది.