విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు ... ఏసీపీ శ్రీనివాసరావు

విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు ... ఏసీపీ శ్రీనివాసరావు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ పోలీస్ స్టేషన్లను ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్లలో కేసులు నమోదు, పరిష్కారాల తీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. విధి నిర్వహణ కోసం ప్రభుత్వం నుండి సిబ్బందికి అందిస్తున్న వసతులు, సౌకర్యాలను ప్రతి కానిస్టేబుల్ అడిగి తెలుసుకున్నారు.

విధుల నిర్వహణ కోసం లాటీలు ఎందుకు వినియోగించడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి రావలసిన వసతులు, సౌకర్యాలు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించడం పోలీసు బాధ్యత అని విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు పోలీసు స్టేషన్ల తనిఖీల్లో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, రాజు ఎస్సైలు నాగరాజు, వినయ్ కుమార్ ఏఎస్ఐ లు రాజమౌళి, రవీందర్, బేగ్ సిబ్బంది పాల్గొన్నారు.