గంజాయి రవాణాదారు అరెస్ట్

గంజాయి రవాణాదారు అరెస్ట్

ముద్ర. స్టేషన్ ఘన్ పూర్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న శంకర్ బిసాల్వ్ అనే వ్యక్తిని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు ఏసిపి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని వద్ద 17.3 కిలోల గంజాయి లభించింది. ఒడిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా, సన కుండి మండలం సింగపూర్ పార్ట్ గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎసిపి వివరించారు. ముంబాయ్ లో బిల్డింగ్ వర్కర్ హేల్పెర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా పని లేక పరిచయం ఉన్న ప్రభాకర్ తో కలిసి గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓడిశా వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కొని ముంబాయి అమ్మడానికి వెళుతుండగా ట్రైన్ లో పోలీస్ తనుఖీలు చేస్తుండడంతో భయపడి  ఘనపూర్ రైల్వే స్టేషన్ లో దిగి బయటకు వస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. గంజాయి పట్టుకోవడం లో ప్రతిభ చూపిన ఘనపూర్ సీఐ రాజు, ఎస్సై నాగరాజు, సిబ్బంది శ్రీనివాస్, అనిల్, యాకయ్య, నరేష్, రాఘవేందర్, హోంగార్డ్ శ్రీను, ఏఏవో సల్మాన్ పాషా సహకరించిన ఆర్పిఎఫ్ సీఐ టిఎస్ఎన్ కృష్ణ లను ఏసీపీ అభినందించారు.