బీసీ నేతగా నేనూ ముందున్నా..

బీసీ నేతగా నేనూ ముందున్నా..
  • జనగామ టికెట్‌ కోసం కేసీఆర్‌‌కు అర్జీ పెట్టుకున్నా..
  • ఉద్యమ నేతగా నాకు తప్పక అవకాశమిస్తరు
  • మద్దూరు మాజీ జడ్పీటీసీ జల్లి సిద్ధయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల) : బీఆర్‌‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కేసీఆర్‌‌ వెన్నంటే ఉండి పోరాటాలు చేసిన బీసీ నేతల్లో తాను ఒకడినని మద్దూరు మాజీ జడ్పీటీసీ జల్లి సిద్ధయ్య తెలిపారు. ఆదివారం జనగామ నియోజవర్గంలోని చేర్యాల, బచ్చన్నపేట మండలాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్‌‌ ఇటీవల రాష్టరంలోని 105 అంసెబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి నాలుగు నియోజకవర్గాలును మాత్రమే పెండింగ్‌ పెట్టిన విషయం తెలిసిందే అన్నారు.

అయితే అందులో జనగామ ఉండడంతో ఈ టికెట్‌పై స్థానికత, బీసీ లీడర్ల డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను కూడా సీఎం కేసీఆర్‌‌ను కలిసి జనగామ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎప్పుడు కూడా పార్టీ లైన్‌ దాటి పని చేయలేదన్నారు. ఉద్యమ నేతగా నియోజకవర్గంలోని అనేక సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని గుర్తుచేశారు. ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌‌ఎస్‌ లీడర్లు బాల లక్ష్మీనారాయణ, నర్ర ఐలయ్య, ఆరెళ్ల వీరమల్లయ్య, హరి రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.