కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, జనగామ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం జనగామ మండలం పసరమడ్ల, నర్మెట మండలం హనుమంతపురం గ్రామాల్లో జరుగుతున్న కంటి వెలుగుల క్యాంపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలకు రాని వారి వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహించుకునేలా ఏఎన్ఎం, ఆశ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్, పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పిల్లల భోజన వసతి, సిబ్బంది హాజరు వివరాలు హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు.   కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌‌ రవీందర్ గౌడ్, డాక్టర్‌‌ ఆశా జ్యోతి, డాక్టర్‌‌ శ్రావణి, మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ పాల్గొన్నారు.