ఆటో ఢీకొని చిన్నారి మృతి

ఆటో ఢీకొని చిన్నారి మృతి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : మంచినీటి సరఫరా చేసే ఆటో ఢీకొని చిన్నారి వర్షిని (3) మృతి చెందిన ఘటన  వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో చోటుచేసుకుంది.  ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.  మాచర్ల లక్ష్మి, కురుమూర్తి దంపతుల కూతురు  వర్షిని సిసి రోడ్డు దాటే క్రమంలో గ్రామానికి చెందిన మంచినీటి సరఫరా చేసే ఆటో అజాగ్రత్తగా నడుపుకుంటూ డ్రైవర్ హరికృష్ణ చిన్నారిని ఢీకొట్టడంతో చిన్నారికి బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందింది. చిన్నారి తల్లి మాచర్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ హరికృష్ణ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.