మార్షల్ ఆర్ట్స్ పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి

మార్షల్ ఆర్ట్స్ పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి
Martial arts should be taught to children from an early age

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : మార్షల్ ఆర్ట్స్ యుద్దకళను పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించడం అభినందనీయమని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ తో జాతీయస్థాయి టోర్నమెంటుకు ఎంపికైన విజేతలను సాహితి కళావేదిక ప్రతినిధులు వనపర్తి పట్టణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్  మాట్లాడుతూ. మార్షల్ ఆర్ట్స్ కళను నేర్చుకోవడం వల్ల పిల్లలకు క్రమశిక్షణ అందించడమే కాక, తమని తాము కాపాడుకునే ఆత్మవిశ్వాసం వారిలో పెంపొందుతుందని అన్నారు. అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు. పోటీల్లో పాల్గొనడం వల్ల పిల్లలలో ఆయా అంశాలపై చక్కని అవగాహన ఏర్పడుతుందని, రానున్న కాలంలో వారు ఎలాంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కొంటారని శంకర్ గౌడ్ తెలిపారు.

అనంతరం జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన రంగం అశ్విని, అంగోత్ సాయి,  ఆదిత్య నాయక్, చీర్ల సాయికృష్ణ సాగర్ లను కళావేదిక సభ్యులు శాలువ,  జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరొజ్ చంద్రశేఖర్, బండారి శ్రీనివాసులు, ఉప్పరి తిరుమలేష్, గుడిసె శివలింగం, వనపర్తి జిల్లా తైక్వాండో అసోసియేషన్ మాస్టర్ వెంకటేష్, స్వామి, ప్రభాకర్ గౌడ్, రవికుమార్, మహేష్, శివకృష్ణ, దీక్షిత్, రక్షిత తదితరులు పాల్గొన్నారు.