రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
  • సహకార సంఘాల ద్వారానే  రైతుల అభివృద్ధి
  • సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు వాటిని సద్వినియం చేసుకొని ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని  సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి సూచించారు. చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సమావేశంలో  ఆదాయ వ్యయలను చర్చించి ఆమోదం తెలుపుతూ సంఘం అభివృద్ధి కొరకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

అనంతరం రూ. 50లక్షల  రుణాలను వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఆయన అందజేశారు. రైతులు తీసుకున్న రుణాలను  సకాలంలో  తిరిగి చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో  ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో చిగురుమామిడి సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రైతులకు అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి , డైరెక్టర్లు తాళ్లపల్లి తిరుపతి,చిట్టుమల్ల శ్రీనివాస్,పోతారవేణి శ్రీనివాస్, బండిలక్ష్మి, పేరాల లక్ష్మి, అందే స్వామి,భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి,ముద్ర కోళ్ల రాజయ్య, సంఘ సీఈవో కాటం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.