రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం రాత్రి నుంచి పలు జిల్లాలలో కురుస్తున్న వర్షాలతో  రహదారులు జలమయమై  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లా కంగల్ లో 77.5 వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.