14 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణమైన మద్దతు – మారేడు ఈశ్వర్

14 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణమైన మద్దతు – మారేడు ఈశ్వర్

ముద్ర. వనపర్తి: తెలంగాణ పిలుపు- భారత రాష్ట్ర సమితి గెలుపు అనే నినాదం చేత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ని 14 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మారేడు ఈశ్వర్ అన్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డమీది కూలులాంటి వాళ్ళని హాట్ కామెంట్ చేసిన రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూనమన్నారు. తెలంగాణ ఆకాంక్ష.తెలంగాణ ఉద్యమం. త్యాగాలు చేసిన అమరవీరుల చరిత్ర తెలియని నీచుడు రేవంత్ రెడ్డి అని,నైతిక విలువలను విస్మరించి రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.  ఉస్మానియా యూనివర్సిటీకి రండి మేము రాజకీయ నైతిక విలువలను ఉద్యమ పాఠాలను  మీకు బోధిస్తామని,కాంగ్రెస్ వాళ్లకు అధికార దాహం తప్ప ప్రజల మీద ప్రాంతం మీద, ప్రాంత బిడ్డల అభివృద్ధి మీద ఏ విధమైన స్పష్టమైనటువంటి ఆలోచన చేయడం లేదని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఆంధ్రవారు తెలంగాణ ప్రాంతం మీద దాడి చేస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం  పై దాడి చేయాలనుకోవడం బాధాకరం అన్నారు. యువత సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత వ్యతిరేకులకు స్పష్టమైన బుద్ధి చెబుతారని ఆశిస్తున్నామని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే. ఆగమవుతాం మన బ్రతుకులు చెదిరిపోతాయి అన్నారు. ఎడారి మాయమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ తాగునీరు.సాగునీరు పుష్కలంగా లభించిందంటే. నీళ్ల  నిరంజన్ రెడ్డి గ పాత్ర ఎంతో అమోఘమైనదని, నేడు వనపర్తిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చబోతున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని భారీ మెజార్టీతో చట్టసభలకు పంపించలని కోరారు. కార్యక్రమంలో ఓయూ. విద్యార్థులుఓంకార్, ప్రతాప్, సురేష,శంకర్,కురుమయ్య,స్వామి, రవీందర్, మల్లేష్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.