గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీ సమావేశాలు కీలకము

గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీ సమావేశాలు కీలకము

 జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
 ముద్ర ప్రతినిధి, వనపర్తి:  గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీ సమావేశాలు ఎంతో కీలకమైనవని,  ప్రతి గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి హాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుధ్యం త్రాగునీరు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులు కృషి చేయాలన్నారు.

ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలోని సమస్యలు అభివృద్ధి తెలుస్తాయని అన్నారు. వైకుంఠధామాలలో అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. డంపింగ్ యార్డ్లను ఉపయోగంలోకి తీసుకువచ్చి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఏ అధికారి పూర్తి వివరాలను వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో  డి. ఆర్. డి. ఏ.డిఎల్పిఓ ఏపీడి ఎంపీ ఓలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.