నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించండి: జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించండి: జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం ఐ. డి. ఓ. సి. కాన్ఫరెన్స్ మీటింగ్ హల్ లో రహదారి భద్రత కార్యక్రమాలపై డి అర్ ఎస్ సి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి తో కలిసి రహదారి భద్రత కార్యక్రమాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బైకులు ర్యాష్గా నడిపిస్తుంటారని, ట్రాఫిక్ పోలీసులు గమనించి రాష్ డ్రైవింగ్ నిరోధించాలన్నారు. బస్సు, లారీ డ్రైవర్లకు హెల్త్ క్యాంపులు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిపై చర్యలు తీసుకోవాలన్నారు. కంటి పరీక్షలు ఏర్పాటు చేసి బస్సు డ్రైవర్ల కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు.

కెపాసిటీ మించి వాహనాలు నడుపుతున్నారని వాటిని నిరోధించాలన్నారు. జాతీయ రహదారిపై ఆటోలను నిషేధించాలని కలెక్టర్ తెలిపారు. అప్రోచ్ రోడ్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రాంతాలైన పెబ్బేరు, కొత్తకోట, పెద్దమందడి ప్రాంతాల పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెల్టూర్ ఎక్స్ రోడ్ దగ్గర ప్రమాదాలు జరగకుండా ఇంజనీర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్టూరు, కని మెట్ట ఎక్స్ రోడ్, పాలెం డాబా, మదర్ తెరిసా జంక్షన్, అమడ బాకుల, ఆర్కే డాబా, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, తోమాలపల్లి, ఆనంద భవన్ ఎక్స్ రోడ్, బైపాస్, రంగాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్ల మైనర్ రిపేర్లు ఉంటే చేయాలని ఆర్ అండ్ బి అధికారికి ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ సూచించారు.

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో హైవే రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవలి అని కమిషనర్లను కోరారు. నేషనల్ హైవే అధికారులు డి. యస్. పి. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలనీ అదేశించిన కలెక్టర్, బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించి వెళ్ళాలి, లేని యడల చర్యలు తీసుకుంటాం అని యస్. పి. హెచ్చరిక చేసినారు. అనంతరం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఆర్. టి. సి. సమీక్షా లో ఆర్. టి. సి. డిపో మేనేజర్ మాట్లాడుతూ నో పార్కింగ్ నో ఎంట్రీ జోన్ ప్రైవేట్ జీప్ ఆటోలు అపుతున్నారని పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకో వాలని కోరారు.

తూఫాన్ బండ్లు హైవే లో స్పీడ్ గా వెళుతున్నాయని, కెపాసిటీ కి మించి తీసుకోని పోతున్నారని, అట్టి వాటి పై చర్యలు తీసుకోవాలని యస్. పి. ని కోరినారు. వారానికి ఒకసారి డి. యస్. పి. ఆర్. టి. సి. ఆర్. టి. ఓ. కలిసి తనిఖీ చేయాలనీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణు గోపాల్, ఎ. యస్. పి. షాకైర్ హుస్సేన్, డి. యస్. పి. ఆనంద్ రెడ్డి, ఆర్. అండ్ బి ఈ ఈ దేశ్య నాయక్, ఆర్. టి. సి. డి. యం. పరమేశ్వరి,ఆర్. టి. ఓ. రమేశ్వర్ రెడ్డి, ఏ. ఓ సాయినాథ్ రెడ్డి, మదన్మోహన్, జాతీయ రహదారుల ఇంజనీర్ సుధాకర్, కమిషనర్లు అనిల్, జాన్ కృపాకర్, ఎంవిఐ అవినాష్, ఏఈలు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.