చెన్నైని చిత్తు చేసిన ఎస్​ఆర్ హెచ్​ 

చెన్నైని చిత్తు చేసిన ఎస్​ఆర్ హెచ్​ 
  • 6 వికెట్ల ఆధిక్యంతో సీఎస్​కే  పై విజయం 
  • మెరిసిన  అభిషేక్​ శర్మ  12 బంతుల్లో 37 పరుగులు

హైదరాబాద్ , ముద్ర  :  సన్‌రైజర్స్ హైదరాబాద్   చెన్నై సూపర్​ కింగ్స్ మధ్య  శుక్రవారం ఉప్పల్​లో   జరిగిన మ్యచ్​లో ఎస్​ఆర్​హెచ్​ ఘన విజయం సాధించింది.  166 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్  బ్యాటర్లు  ప్రారంభంలోనే దూకుడుగా  ఆట మొదలు పెట్టారు.   ఓపెనర్​ అభిషేక్  చెన్నై బౌలింగ్ ను తుక్కు  తుక్కు చేసాడు  . 2. 4 ఓవర్లలోనే  స్కోర్  46 పరుగులు చేసారు.   సరిగ్గా ఇక్కడే తొలి వికెట్ (  అభిషేక్ శర్మ  37 పరుగులు  ) పడింది  అటు తర్వాత మార్కరమ్​ , హెడ్ స్కోర్ పెంచుకుంటూ వచ్చారు. స్కోర్ 106 పరుగుల వద్ద ఉండగా రెండో వికెట్  ( హెడ్ 31 ) కోల్పోయింది.   ఆ తర్వాత  స్కోర్​ 132 పరుగుల వద్ద ఉండగా  మార్కరమ్​ ( 5‌0 పరుగులు ) ఔటయ్యాడు.  అటు తర్వాత  18. 1 ఓవర్లలో  6 వికెట్ల ఆధిక్యంతో  166  పరుగులతో అద్భుత విజయం సాధించింది. చెన్నై జట్టు ఏ స్ధాయిలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.  

ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసారు ,  అలాగే సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్​ కూడా మ్యాచ్ తిలకించారు.  అంతకుముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీలింగ్ ఎంచుకుంది.  సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి రాణించారు. సొంత మైదానం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మంచి దూకుడు మీద చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో  చెన్నై సూపర్​ కింగ్స్  5 వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. 45 పరుగులు చేసిన శివమ్ దూబే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వేగంగా ఆడేందుకు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పైనే అతడు 24 బంతుల్లో 45 పరుగులు కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.    ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమ్మిన్స్, షాబాద్ అహ్మద్, జయ్‌దేవ్ ఉనడ్కత్ తలో వికెట్ తీశారు కాగా, ఈ మ్యాచ్ ను తిలకించేందుకు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు.   సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇది రెండో విజయం. 4 మ్యాచ్​లు ఆడిన ఎస్​ఆర్ హెచ్​ రెండు మ్యాచ్​లు ఓడిపోగా రెండు గెలుచుకుంది.