ఐపీఎల్ చరిత్రలో చెరిగిపోని రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో చెరిగిపోని రికార్డులు

ఈ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యం

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు అనేక రికార్డులు నమోదయ్యాయి. అనేక మంది ఆటగాళ్లు తమ పేరిట రికార్డులను లిఖించుకున్నారు. కొన్ని ఫ్రాంచైజీలు కూడా అరుదైన రికార్డులను దక్కంచుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అటువంటి రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఆ రికార్డుల్లో ఎప్పటికీ చెరిగిపోని రికార్డులు కొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

నైట్ రైడర్స్ వరుస విజయాలు


2014 సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భీరకమైన ఆటతీరు కనబరిచింది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని నైట్ రైడర్స్ జట్టు ఆ ఏడాది టైటిల్ కైవసం చేసుకుంది. నైట్ రైడర్స్ జట్టుకు అది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఫైనల్ వరకు జరిగిన 9 మ్యాచులను ఎక్కడా బ్రేక్ లేకుండా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలు సాధించింది. దాంతో పాటు 2015లో జరిగిన తొలి మ్యాచ్ కూడా నెగ్గింది. తద్వారా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా 10 మ్యాచుల్లో విజయాలు సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్టుగా చరిత్రలో నిలిచిపోనుంది. ప్రస్తుత జట్ల ఆటతీరు చూస్తే ఏ జట్టు కూడా నిలకడగా రాణించడం లేదు. ఎంతో పటిష్టమైన జట్లు కూడా అనవసర తప్పిదాలకు పాల్పడుతూ ఓటమి పాలౌతున్నాయి. నిలకడలేమితో సతమతం అవుతున్నాయి.

అత్యధిక భాగస్వామ్యం


2016లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ జట్టు వీరవిహారం చేసింది. కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు చేశాడు. టోర్నీ మొత్తంలో 973 పరుగులు చేశాడు. అదే సీజన్లో తన సహచరుడు ఏబీ డివిలియర్స్ తో కలిసి కోహ్లీ నెలకొల్పిన భాగస్వామ్యం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. భవిష్యత్తులో కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఆ మ్యాచులో డివిలియర్స్ 129 పరుగులు చేశాడు. కోహ్లీ 109 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2016లో 

ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు

2011లో క్రిస్ గేల్ వీర విహారం చేశాడు. కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 37 పరుగులు చేశాడు. సరిగ్గా పదేళ్ల తర్వాత  2021లో రవీంద్ర జడేజా కూడా అటువంటి ఫీట్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన జడేజా...బెంగళూర్ జట్టు తరపున ఆడుతున్న హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఏకంగా 37 పరుగులు రాబట్టాడు.క్రిస్ గేల్ రికార్డు సమం చేశాడు. ఒక ఓవర్లో 38 పరుగులు చేయడం ద్వారా వారిద్దరి రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రికార్డు కూడా ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోనుంది. ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది గుజరాత్ జట్టును మట్టి కరిపించాడు. 

66 బంతుల్లో 175 పరుగులు
2013లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్ వీరవిహారం చేశాడు. పూణె వారియర్స్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 66 బంతుల్లో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఆ మ్యాచులో బెంగళూర్ జట్టు 130 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇది కూడా ఐపీఎల్ చరిత్రలో ఒక చెరిగిపోని రికార్డుగా మిగిలిపోనుంది.