భారత్​–పాక్​ మ్యాచ్​ హోటళ్ల ధరల్లో భారీ పెరుగుదల

భారత్​–పాక్​ మ్యాచ్​ హోటళ్ల ధరల్లో భారీ పెరుగుదల

అహ్మాదాబాద్​: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్​ను దృష్టిలో పెట్టుకొని అహ్మాదాబాద్​లోని హోటళ్లు భారీగా ధరలు పెంచడమే కాకుండా ఇష్టారీతిన బుకింగ్​ ధరలను పెంచేశాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికే అన్ని హోటళ్లు ఫుల్​ అయిపోయినట్లు తెలుస్తోంది. ఐసీసీ మంగళవారం (జూన్ 27) క్రికెట్ ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది.అక్టోబర్ 15వ తేదీన ఇదే స్టేడియంలో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ అహ్మాదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుంది.  ఫైనల్‌ సహా ఐదు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగానే నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే, అహ్మదాబాద్ నగరంలో లగ్జరీ హోటల్ రూమ్ ధరలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు ఉంటాయి. అక్టోబర్ 15వ తేదీ రాత్రికి ఈ ధరలు రూ. 40,000 నుంచి రూ. 1 లక్ష వరకూ పెరిగాయి. ఉదాహరణకు, అహ్మదాబాద్ నగరంలోని ఐటీసీ హోటల్స్‌ జూలై 2న రూ. 5,699కే డీలక్స్ గదిని అందిస్తోంది. అక్టోబర్ 15న అదే హోటల్‌లో ఒక రోజు బస కోసం రూ. 71,999 వసూలు చేయడం గమనార్హం. అక్కడ ఉన్న అన్ని హోటళ్లలో ధరలు ఇదే మాదిరి పెంచేయడం గమనార్హం.